మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నెంబర్ మార్పు

29 May, 2014 22:24 IST|Sakshi

హైదరాబాద్: సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లు మారనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్-మణుగూర్  ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 12752/12751 నెంబర్ ఆగస్టు  ఒకటవ తేదీ నుంచి 17026/17025 గా మారనుంది.

అలాగే  ప్రస్తుతం సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 17050/17049 నెంబర్  ఆగస్టు ఒకటో తేదీ నుంచి  17250/17249 గా మారనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు