పెనుకొండ ఆస్పత్రిలో ఉద్రిక్తత

30 Oct, 2014 10:28 IST|Sakshi

అనంతపురం : అనంతపురం జిల్లా పెనుకొండ ఆస్పత్రి వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెనుకొండలో గురువారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. రెచ్చిపోయిన ఆ పిచ్చికుక్క దారిన వెళ్లేవారిపై దాడి చేసింది.   ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా బెంగళూరు వెళ్లి చికిత్స చేయించుకోమంటూ చేతులు దులుపుకోవటంతో స్థానికులు ఆందోళనకు దిగారు.  చికిత్స చేయకుండానే వేరే ఆస్పత్రికి ఎలా రిఫర్ చేస్తారంటూ బాధిత కుటుంబాలు మండిపడ్డారు. మరోవైపు పిచ్చికుక్కను స్థానికులు కొట్టి చంపేశారు.

మరిన్ని వార్తలు