మాదిగపల్లిలో పిచ్చికుక్కల స్వైరవిహారం

23 Aug, 2015 18:07 IST|Sakshi

సుండుపల్లి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం దిగువమాదిగపల్లిలో ఆదివారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటోన్న ఇద్దరు చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపర్చి కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లాయి.

గాయపడిన  ఇద్దరు చిన్నారులు మోహిత్ కుమార్ (ఏడాదిన్నర వయసు), బబ్లూ (ఏడాది వయసు)లను సుండుపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా..అక్కడి వైద్యుల సూచనమేరకు తిరుపతికి తరలించారు.

మరిన్ని వార్తలు