మహా ‘మాగ’.. ధర బాగా!

21 Mar, 2015 07:34 IST|Sakshi
మహా ‘మాగ’.. ధర బాగా!

నాగాయలంక: సాధారణంగా కేజీ నుంచి ఐదు కేజీల బరువుండే ‘మాగ’ చేప ఏకంగా 30 కిలోలు తూగింది. ఇండియన్ సాల్మోన్ శాస్త్రీయ నామం కలిగిన ఈ చేపను తీరప్రాంతంలో ‘మాగ’గా పిలుస్తారు. కృష్ణాజిల్లా  నాగాయలంకలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఓ చేపల కొనుగోలు కంపెనీలో శుక్రవారం ఈ చేప కనిపించింది. 

సముద్రపు చేపలవేటలో ఈలచెట్లదిబ్బ మత్స్యకారులకు దొరికింది. ఈ చేప ఖరీదు కేజీ  రూ.1300 పలికింది. అంటే రూ. 39 వేలు అన్నమాట.

మరిన్ని వార్తలు