ముగిసిన మహాసంప్రోక్షణ

17 Aug, 2018 01:28 IST|Sakshi
శ్రీవారి ఆలయంలో ఉన్న ఉప ఆలయాలకు మహాసంప్రోక్షణ నిర్వహిస్తున్న అర్చకులు

నేటి నుంచి మళ్లీ స్వామి దర్శనాలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకో సారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలా లయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ముగిసింది. తమ విజ్ఞప్తి మేరకు సహ కరించిన భక్తులందరికీ టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధా కర్, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రుత్వికులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్ర మాన్ని దిగ్విజయంగా నిర్వహించారని వారు కొని యాడారు.

టీటీడీ నిర్ణయించిన సమయాల్లో యాగ శాల కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు ఎంతో క్రమశిక్షణతో స్వామివారిని దర్శించు కున్నారన్నారు. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ ఆగమ సలహా మండలి సూచనల మేరకు పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్‌ సమక్షం లో, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైభవంగా మహాసంప్రోక్షణ కార్య క్రమాన్ని నిర్వహించామన్నారు. 44 మంది రుత్వి కులు, 100 మంది వేద పండితులు ఈ క్రతువులో పాల్గొన్నారని తెలిపారు. ఆగస్టు 11–15 వరకు మొత్తం 1.35 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. మహాసంప్రోక్షణ క్రతువు పూర్తయినందున 17వ తేదీ శుక్రవారం నుండి స్వామివారి సేవలు ప్రారంభమవుతాయని భక్తులు  శ్రీవారి దర్శించుకోవచ్చన్నారు. 

మరిన్ని వార్తలు