మనోహరం..మయూర వాహనోత్సవం

18 Feb, 2020 09:02 IST|Sakshi
 భక్తజనం మధ్య మల్లన్న మయూర వాహనోత్సవం

పట్టు వ్రస్తాలు సమర్పించిన టీటీడీ, కాణిపాకం దేవస్థానాలు

నేటి రాత్రి నుంచి మల్లన్న దూర(అలంకార) దర్శనం

సాక్షి, శ్రీశైలం : శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి మయూరవాహనంపై  ముగ్ధమనోహరంగా భక్తులకు సో మవారం దర్శనమిచ్చారు. స్వామివార్ల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ‘ఓం హర శంభో శంకరా... శ్రీశైల మల్లన్నా పా హిమాం.. పాహిమాం’ అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. రాత్రి 7.30 గంటలకు అలంకార మండపంలో ఉత్సవమూర్తులను మయూర వాహనంపై అధిష్టింపజేశారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు శా్రస్తోక్తంగా వాహన పూజలను నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన శ్రీ స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయుల గోపురం గుండా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30గంటలకు  ఆలయ ప్రాంగణం చేరింది.  గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించి పునీతులయ్యారు.  

పట్టు వ్రస్తాల సమర్పణ.. 
బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి పర్వదినాన జరిగే స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానాల తరపున ఆదివారం పట్టు వ్రస్తాలను సమరి్పంచారు. కాణిపాకం దేవస్థానం తరపున ఈఓ వి. దేముళ్లు , టీటీడీ దేవస్థానం తరఫు ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ , టీటీడీ పాలక మండలి చైర్మన్‌  వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఆ దేవస్థానం ఓఎస్‌డీ డాలర్‌ శేషాద్రి, అర్చక వేదపండిత బృందం పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులకు శాస్త్రోక్త పూజలు చేసి  స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంగళవారం  సాయంత్రం సంప్రదాయానుసారం పట్టువ్రస్తాలను సమరి్పంచనున్నట్లు ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు.   

నేటి రాత్రి 7.30 గంటల వరకే మల్లన్న స్పర్శదర్శనం 
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి 7.30 వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు. ఆ తర్వాత నుంచి దూర (అలంకార)దర్శనం ప్రారంభిస్తామన్నారు. ఈనెల 24 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల దూరదర్శనం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. శివస్వాములు, సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు  కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు ఉండబోదని స్పష్టం చేశారు.  

నేడు శ్రీశైలంలో... 
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవరోజు మంగళవారం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను రావణవాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవా న్ని నిర్వహిస్తారు.ఉదయం 7.30గంటలకు నిత్య హోమ బలిహరణలు, జపానుష్ఠానములు, నిర్వహిస్తారు. సాయంత్రం 5.30గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలను సమర్పిస్తారు. 


టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న శ్రీశైలం ఈఓ 

శ్రీశైలం అభివృద్ధికి టీటీడీ సహకారం  
శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి టీటీడీ సహకారం అందజేస్తుందని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్వామిఅమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమరి్పంచిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలంలో జరిగే  శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివార్లకు సంప్రదాయానుసారం టీడీపీ తరపున పట్టువస్త్రాలను సమరి్పస్తున్నామన్నారు. శ్రీశైల  క్షేత్ర అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యాల కల్పనకు టీటీడీ తరపున నిధులను కూడా విడుదల చేస్తామని అన్నారు. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి, వెంకటేశ్వరస్వామి స్వామి కృపతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు