శ్రీశైలం.. ఉత్సవ శోభితం

19 Feb, 2020 08:01 IST|Sakshi

రావణ వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు

మల్లన్నకు పట్టువ్రస్తాలను సమర్పించిన మంత్రి బుగ్గన

సాక్షి, శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం.. రావణ వాహనంపై శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహన ప్రత్యేక పూజలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఈఓ కేఎస్‌ రామరావు  తదితరులు  పాల్గొన్నారు.  విశేషపూజల అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలను చేసి నారికేళం సమరి్పంచి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం  అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కనుల పండువగా సాగింది. లక్షలాది మంది భక్తులు రావణ వాహనా«దీశులైన స్వామిఅమ్మవార్లను పురవీధుల్లో దర్శించుకొని కర్పూర నీరాజనాలు అరి్పంచారు. రాత్రి 9.30 గంటలకు గ్రామోత్సవం ఆలయ ప్రాంగణం చేరుకుంది.    

మల్లన్నకు పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి బుగ్గన  
ఈ నెల 21వ తేదీన నిర్వహించే శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పట్టువ్రస్తాలను  సమరి్పంచారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాలను సమర్పించడం ఆనవాయితీగా ఉంది. ఇందులో భాగంగా ప్రధానాలయగోపురం ముందు ఏర్పాటు చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తుల ఎదుట పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులను ఉంచి శాస్త్రోక్తంగా అర్చకులు, వేదపండితులు పూజలను నిర్వహించారు. అనంతరం  మంత్రి, ఈఓ  తదితరులంతా పట్టువ్రస్తాలు, ఫలపుష్పాదులను తలపై పెట్టుకుని ఆలయప్రవేశం చేశారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలను సమరి్పంచిన అనంతరం వారు రావణవాహనంపై అధిష్టింపజేసిన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సేవలో పాల్గొన్నారు. ఆత్మకూరు–దోర్నాల ఘాట్‌ రోడ్డు పరిస్థితిపై ఎమ్మెల్యే శిల్పాతో చర్చించామని  అటవీశాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ అధికారులు, ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు.   

నేడు మల్లన్నకు పుష్పపల్లకీ సేవ....  
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను పుష్పపల్లకీ అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనికి ముందుగా ఆలయప్రాంగణంలోని  అక్కమహాదేవి అలంకార మండపం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలను చేస్తారు. ఉత్సవమూర్తులను గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన పుష్పపల్లకీపై అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ పుష్పపల్లకి మహోత్సవం రథశాల నుంచి నందిమండపం వద్దకు వెళ్లి తిరిగి రథశాల వద్దకు  చేరుకుంటుంది. 

>
మరిన్ని వార్తలు