సీఎం జగన్‌ను కలిసిన ‘మహా’ అధికారుల బృందం​

20 Feb, 2020 17:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ’చట్టం గురించి అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారుల బృందం సీఎం జగన్‌ను కలిసి దిశా చట్టం గురించి అడిగి తెలుసుకుంది.


(చదవండి :మహారాష్ట్రలో దిశ చట్టం!)

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆ బృందానికి దిశ చట్టం గురించి వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన బృందంలో మహారాష్ట్ర హోమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, డీజీపీ సుబోత్‌ కుమార్‌, అదనపు సీఎస్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపిక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు