కనకదుర్గమ్మ గుడిలో ‘మహర్షి’ టీమ్‌

18 May, 2019 19:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’  ఇటీవల విడుదలై.. ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర బృందం శనివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. హీరో మహేశ్‌బాబు సహ సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఆలయాన్ని దర్శించుకొని.. కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆలయ మర్యాదలతో మహర్షి చిత్రబృందానికి అధికారులు  స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో మహేష్‌బాబు కనిపించడంతో ఆయనన చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీపడ్డారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా