కుల వివక్షపై పోరాడిన మహనీయుడు పూలే

29 Nov, 2013 03:34 IST|Sakshi

నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే అని కలెక్టర్ టి.చిరంజీవులు కొనియడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్‌లో జరిగిన పూలే వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, మహిళా అక్షరాస్యత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పోరాడాడన్నారు. అందరూ అక్షరాస్యులు అయితేనే పూలే ఆశయాలను సాధించినట్టవుతుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. బీసీల్లో 144 కులాలున్నాయన్నారు. ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చునన్నారు.
 
 ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన, నిర్బంధ విద్య కోసం పూలే ఎంతో కృషి చేశారన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని.. పూలే ఆశయాలను నెరవేర్చాలన్నారు. కేంద్రం విద్యాభివృద్ధికి రూ.50 వేల కోట్లు యేటా ఖర్చు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, ఏజేసీ నీలకంఠం, డీఈఓ జగదీష్, బీసీ సంక్షేమ శాఖ ఈడీ గంగాధర్, డీడీ రాజశేఖర్, ఆర్డీఓ జహీర్, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, సుంకరి మల్లేష్‌గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, చక్రహరి రామరాజు, కొండేటి మల్లయ్య, పంకజ్‌యాదవ్, ఎస్.మల్లయ్య, పర్వతాలు, బొర్ర సుధాకర్, జి.వెంకన్న, డి.లక్ష్మీనారాయణ, వెంకటపతి, అంబటి వెంకన్న, మాసారం సిద్ధార్థ పూలే తదితరులు పాల్గొన్నారు.
 
 నిత్యావసర వస్తువుల వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలి
 కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో సబ్సిడీని భరిస్తూ ప్రజలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు కృషి చేస్తుందని.. పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై వాటి వివరాలు ఉంచాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. గురువారం జేసీ ఛాంబర్‌లో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు, కిరోసిన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 గ్రామంలో ఉన్న రేషన్‌షాపుల వివరాలు.. అందులో వచ్చే సరుకుల వివరాలు గ్రామ ప్రజలకు తెలిసేలా చూడాలని  కోరారు. కిరోసిన్ సక్రమంగా ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు. అమ్మహస్తం కార్యక్రమం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్నప్పుడు వాటిని డీలర్లు డీడీలు చెల్లించడంలో అలసత్వం వహిస్తున్నారని, 3 నెలల వరకు డీడీలు చెల్లించని వారికీ నోటీసులు జారీ చేయాలని పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. అనంతరం ఎల్‌పీజీ, సీడింగ్, దీపం పథకం గ్రౌండింగ్, రేషన్‌కార్డుల సీడింగ్, కొత్త కార్డుల పంపిణీ, సేల్ ప్రొసీడ్స్‌పై జేసీ హరిజవహర్‌లాల్ సమీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎల్‌పీజీ గ్యాస్ సీడింగ్‌లో ఆధార్‌నమోదు అనుకున్నంత రీతిలో జరగడం లేదని, దానిని ఏజెన్సీల వారు బాధ్యతగా తీసుకుని నమోదు చేయించాలని తెలిపారు. సమావేశంలో డీఎస్‌ఓ నాగేశ్వరరావు, ఎఎస్‌ఓ వెంకటేశ్వర్లు, కిరోసిన్ డీలర్లు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు