సైనికులమై సాగుదాం...

16 Mar, 2019 14:19 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు 

సాక్షి, వేపాడ: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని విజయం వైపు నడిపించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు అంతా సైనికులమై సాగుదామని ఆ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని ఆతవ గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు మెరపల సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలుగుదేశం 600 హామీలను ఇచ్చి మోసపుచ్చిందన్నారు. ఐదేళ్లు అభివృద్ధి, సంక్షేమం పట్టని తెలుగుదేశం పాలకులకు ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారని దుయ్యబట్టారు. ఎన్నికల వేళ డ్వాక్రా సంఘాలకు పసుపు – కుంకుమ చెక్కుల పేరిట మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరయ్యాయని చెప్పారు. వర్షాధార ప్రాంతమైన నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదని గుర్తు చేశారు.

ఆతవను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయానికి పాటుపడాలన్నారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఎస్‌.కోట నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులతో జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఆయన ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామన్నారు. గత 45ఏళ్లలో అభివృద్ధి కేవలం ఐదేళ్లలో రెట్టింపు అభివృద్ధి చేస్తామని మీ అందరి సహాకారం కావాలని ఒక్కసారి జగనన్నకు అవకాశం కల్పించాలని కోరారు.  

ఎస్‌.కోట నియోజకవర్గ ఇన్‌చార్జి పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ నాయకులంతా ఐక్యత, సమన్వయంతో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 20రోజులు అవిశ్రాంతంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, ఇందుకూరు రఘురాజు. మాజీ జెడ్పీటీసీలు వేచలపు వెంకట చినరామునాయుడు, మూకల కస్తూరీ, తూర్పాటి వరలక్ష్మి, ఎంపీటీసీలు దొగ్గ సత్యవంతుడు, అడపా ఈశ్వర్రావు, సిహెచ్‌.పద్మావతి, దుల్ల వెంకటరమణ, గ్రామానికి చెందిన నాగిరెడ్డి నాయుడు, రొంగలి కృష్ణమూర్తి, గొంప అవతారం, గొంప నాయుడు, నెక్కల ఈశ్వర్రావు, కసిరెడ్డి సత్తిబాబు, బొడ్డు వెంకునాయుడు, మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు