నేటి ముఖ్యాంశాలు

23 Dec, 2019 06:53 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ 
 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు జమ్మలమడుగు మండలంలో స్టీల్‌ప్లాంట్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ పునాదిరాయి వేయనున్నారు. అలాగే 25వ తేదీ వరకు పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

తెలంగాణ
దిశకేసు నిందితుల మృతదేహాలకు నేడు రీపోస్టుమార్టం జరగనుంది. ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులతో రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు.

► నేటి నుంచి హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో క్యూఆర్‌ కోడ్‌ టికెట్‌ విధానం అందుబాటులోకి రానుంది. ఇకపై అన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌ చేసుకోని.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో మెట్రోలో ప్రయాణించవచ్చు. 

జాతీయం
► జాతీయ పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో రాజ్‌ఘాట్‌ వద్ద కాంగ్రెస్‌ సత్యాగ్రహం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ కీలక నేతలు సోనియా, రాహుల్‌ పాల్గొననున్నారు. 

► నేడు ఢిల్లీలో 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. విజ్ఞాన్‌భవన్‌ ఉప రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. 

► జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. 

భాగ్యనగరంలో నేడు..

  • కూచిపూడి, వేదిక: రవీంద్రభారతి, సమయం: సాయంత్రం 6 గంటలకు
  • కంప్యూటర్‌ క్లాసెస్‌, వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌, సమయం: సాయంత్రం 6 గంటలకు
  • కార్నాటిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌, వేదిక: శిల్పారామం, సమయం: సాయంత్రం 5–30 గంటలకు
  • డిజైనర్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 9 గంటలకు
  • బనారస్‌ శారీ ఎగ్జిబిషన్‌, వేదిక: సప్తపర్ణి, రోడ్‌ నం.8, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 10 గంటలకు  
మరిన్ని వార్తలు