నేటి ముఖ్యాంశాలు..

27 May, 2020 06:47 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
► ‘మన పాలన - మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విద్యారంగంపై సదస్సు నిర్వహించనున్నారు. విద్యారంగంలో ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరు.. తదితర అంశాలపై ఈ సదుస్సులో చర్చించనున్నారు.

తెలంగాణ
► నేడు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి, ఆంక్షల ఎత్తివేత, రాత్రిపూట కర్ఫ్యూపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై స్పష్టతినిచ్చే అవకాశం కనిపిస్తోంది. 

► రాష్ట్రంలో ఎంసెట్‌, ఈసెట్‌ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 31 నుంచి జూన్‌ 10 వరకు పొడిగించారు. 

జాతీయం 
► వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్‌ సముద్రం, దానిని అనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా