నేటి ముఖ్యాంశాలు..

6 Apr, 2020 06:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌:
ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 252కు చేరింది. 
► అత్యధికంగా కర్నూలు జిల్లాలో 53 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
► ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.
► నేడు అర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అనంతపురం జిల్లా పర్యటించనున్నారు.
► నేడు గుంటూరు నగరంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌రావు తెలిపారు.

తెలంగాణ:
 తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 334కు చేరింది. 
 ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
 తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

జాతీయం:
  దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,289 కి చేరింది.
  ఇప్పటివరకు దేశంలో 118 మంది మృతి చెందగా, 328 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
  మహారాష్ట్రలో 748 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు.
  తమిళనాడులో 571 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు.
  ఢిల్లీలో 503 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు.

అంతర్జాతీయం:
 ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12.71 లక్షలు దాటింది. 
 ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 69 వేలు దాటింది.
 ఇప్పటివరకు 2.61 లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు.
 అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.36 లక్షలు దాటింది 
 అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 9,602 మంది మృతి చెందారు.

>
మరిన్ని వార్తలు