నేటి ముఖ్యాంశాలు

11 May, 2020 06:54 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
► విశాఖ గ్యాస్ లీక్ సంఘటన, సహాయక చర్యలపై..
► నేడు ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ వీడియోకాన్ఫరెన్స్

► ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న దుకాణాలు
► కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి తెరుచుకోనున్న దుకాణాలు
► ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుచుకోనున్న దుకాణాలు
► కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ఆంక్షలు యథాతథం

తెలంగాణ:
► తెలంగాణలో నేటి నుంచి ప్లాస్మా థెరపీకి సన్నాహాలు
► ఇప్పటికే ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన 15 మంది

► నేటి నుంచి ఆయిల్ ట్యాంకర్ల లారీ ఓనర్స్ సమ్మె
► ట్రాన్స్‌పోర్టర్స్‌ రవాణా చార్జీల్లో 80 శాతం కోత విధించిన హెచ్‌పిసిఎల్
► రవాణా కాంట్రాక్టర్ల మూకుమ్మడి సమ్మె
► సూర్యాపేట నుంచి వెళ్లే 500 ఆయిల్ ట్యాంకర్ల నిలిపివేత
► ప్రధానంగా సింగరేణికి సరఫరా నిలిపివేత

జాతీయం:
► నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
► కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై చర్చించనున్న ప్రధాని మోదీ
► ఐదోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌, అందరు సీఎంలకు మాట్లాడే అవకాశం

 నేటితో 48వ రోజుకు చేరిన లాక్‌డౌన్
► కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్

అంతర్జాతీయం: 
  ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41.77 లక్షలు దాటింది. 
  ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.83 లక్షల మంది మృతి చెందారు.
  ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 14.87 లక్షల మంది కోలుకున్నారు. 
 
 

మరిన్ని వార్తలు