సమరానికి సై

24 Mar, 2019 12:13 IST|Sakshi

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు

నామినేషన్లు వేసిన టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు

25న నామినేషన్‌ వేయనున్న వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు

సాక్షి, పర్చూరు (ప్రకాశం): ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి 2019 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈసారి పర్చూరు అసెంబ్లీ బరికి బహుముఖ పోటీ నెలకొననుంది. ఓటమి ఎరుగని రాజకీయ ఉద్దండుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రస్తుతం పోటీలో నిలిచి మరో మారు విజయకేతనం ఎగురవేయాలని ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ తరపున ఏలూరి సాంబశివరావు, బీజేపీ తరపున చెరుకూరి రామయోగేశ్వరరావు, కాంగ్రెస్‌ తరపున పొన్నగంటి జానకీరామయ్య, జనసేన కూటమి తరపున బీఎస్పీ అభ్యర్థి పెదపూడి విజయ్‌కుమార్‌ పోటీ చేయనున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇప్పటికే తమ నామినేషన్లు దాఖలు చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి:  దగ్గుబాటి వెంకటేశ్వరరావు

పుట్టినతేదీ: 14–12–1953
విద్యార్హత: ఎం.బి.బి.ఎస్, పీజీ
తల్లిదండ్రులు: రమాదేవి, చెంచురామయ్య
సామాజిక వర్గం: ఓసీ
కుటుంబం: భార్య పురందేశ్వరి
కుమార్తె: నివేధిత
కుమారుడు: హితేష్‌చెంచురామ్‌
స్వగ్రామం: కారంచేడు గ్రామం, కారంచేడు మండలం, ప్రకాశం జిల్లా

టీడీపీ అభ్యర్థి: ఏలూరి సాంబశివరావు

పుట్టినతేదీ:  26–01–1977
విద్యార్హత:  ఎమ్మెస్సీ (హర్టీకల్చర్‌)
తల్లిదండ్రులు: ఏలూరి నాగేశ్వరరావు, సుశీలమ్మ
సామాజిక వర్గం: ఓసీ
కుటుంబం: భార్య మాలతి
కుమారులు: దివేశ్, మైనాంక్‌ తారక్‌
స్వస్థలం: కోనంకి గ్రామం, మార్టూరు మండలం

బీజేపీ అభ్యర్థి: చెరుకూరి రామయోగేశ్వరరావు

పుట్టినతేదీ: 30–07–1966
విద్యార్హత: 10వ తరగతి
తల్లిదండ్రులు: వెంకట సుబ్బయ్య, అన్నపూర్ణమ్మ
సామాజిక వర్గం: ఓసీ
కుటుంబం: భార్య: రమాదేవి
కుమారులు: వెంకటకృష్ణ, పవన్‌కుమార్‌
స్వస్థలం: గన్నవరం గ్రామం, యద్దనపూడి మండలం

కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి: పొన్నగంటి జానకీరామారావు

వయస్సు: 49 సం.లు
విద్యార్హత: 7వ తరగతి
తల్లిదండ్రులు: వెంకటేశ్వర్లు, శివనాగమల్లేశ్వరి
సామాజిక వర్గం: ఓసీ
కుటుంబం : భార్య: నాగరాజకుమారి
 కుమారులు: రామోజీరావు, లక్ష్మీనరేంద్రబాబు, తివిక్రమార్కుడు 
స్వస్థలం: ఇంకొల్లు గ్రామం, మండలం

బీఎస్పీ అభ్యర్థి: పెదపూడి విజయ్‌కుమార్‌

పుట్టినతేదీ: 10–07–1989
విద్యార్హత: ఎం.ఏ., ఎం.ఫీల్‌ (పీహెచ్‌డీ)
తల్లిదండ్రులు: పూర్ణ్ణచంద్రరావు, అక్కాయమ్మ
సామాజిక వర్గం: ఎస్సీ
కుటుంబం :  భార్య: అనురాధాలక్ష్మీ
కుమార్తె: సుజితావిజయ్‌ 
స్వస్థలం: ముప్పాళ్ల గ్రామం, నాగులుప్పలపాడు మండలం

 25 న నామినేషన్లు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి చెరుకూరి రామయోగేశ్వరరావు, బీఎస్పీ తరపున పెదపూడి విజయ్‌కుమార్‌ కూడా ఈనెల 25వ తేదీన నామినేషన్‌ వేయనున్నట్లు ఆయా పార్టీల అభ్యర్థులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తరపున హరిబాబు, శ్రీకాంత్‌లు ఆర్‌ఓ సుధాకర్‌ కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పి. జానకీరామారావు కూడా నామినేషన్‌ వేశారు.

మరిన్ని వార్తలు