పదేళ్లపాటు హైదరాబాద్ యూటీ చేయాలి: కావూరి

14 Feb, 2014 15:23 IST|Sakshi
పదేళ్లపాటు హైదరాబాద్ యూటీ చేయాలి: కావూరి

తెలంగాణ బిల్లుకు సవరణలు చేస్తేనే తాము ఆమోదిస్తామని, లేని పక్షంలో మళ్లీ వెల్లోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణను ఏర్పాటుచేయాలని, భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండు చేశారు. కేంద్ర సంఘటిత నిధి నుంచి సీమాంధ్రలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే, హైదరాబాద్ నగరాన్ని పది సంవత్సరాల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో సీమాంధ్రకు కూడా భాగం ఇవ్వాలని కావూరి అడిగారు. ఈ సవరణలకు అంగీకరించని పక్షంలో తాము మరింతగా ఆందోళన చేయడం ఖాయమని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు