కొత్త రాజధానిపై సూచనలు చేయండి

23 Apr, 2014 03:27 IST|Sakshi

{పజలు, సంస్థలకు కేంద్రం వినతి
30లోగా సలహాలు ఈ-మెయిల్ ద్వారా పంపాలని వెల్లడి
 

 హదరాబాద్: సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ప్రజలు, సంస్థల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. కొత్త రాజధాని ఎంపికకు నియమించిన కె.సి.శివరామకృష్ణన్ కమిటీకి సలహాలు, సూచనలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం కోరింది. ఈ నెల 30 లోగా ్ఛ్ఠఞఛిౌఝ్టఃఝజ్చి.జౌఠి.జీ మెయిల్‌కు వీటిని పంపాలని తెలిపింది. రాజ్‌భవన్, అసెంబ్లీ, శాసన మండలి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయ భవనాలు, అతిథి గృహాలు, ఆస్పత్రులు, హోటళ్లు, స్కూళ్లు. కళాశాలలు తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రాజధాని ఎంపిక కసరత్తు చేయాలని నిపుణుల కమిటీకి ఇచ్చిన మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.

ప్రస్తుత ఉమ్మడి రాజధానికి, కొత్త రాజధానికి మధ్య రైలు, రోడ్డు మార్గాలను, కొత్త రాజధానికి ఆ ప్రాంతంలోని  జిల్లాలకు రోడ్డు మార్గాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. కొత్త రాజధాని ఎంపికలో వీలైనంత తక్కువగా వ్యవసాయ భూమి అవసరం ఉండేలా చూడాలని, నీటి వసతి, వరదలు, తుఫానులను దృష్టిలో ఉంచుకోవాలని, వీలైనంత తక్కువ నిర్మాణాలు, భూసేకరణ ఉండేలాగ చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిపుణుల కమిటీ ఆగస్టు 31కల్లా కేంద్రానికి నివేదిక ఇవ్వాలి.
 

మరిన్ని వార్తలు