తాగుబోతుల నిలయంగా మార్చారు

27 Jun, 2013 12:21 IST|Sakshi
తిరుపతిని మద్యపాన రహిత ప్రాంతంగా ప్రకటించాలి

తిరుపతి :  పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని మద్యపాన రహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం మహాధర్నా చేపట్టింది. పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో డీఆర్ మహల్ జంక్షన్ వద్ద చేపట్టిన ధర్నాకు మహిళలు వందలాదిగా తరలివచ్చారు. తిరుపతిలో మద్యపానాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని తాగుబోతుల నిలయంగా మార్చిన ఘనత కిరణ్దేనని విమర్శించారు. కిరణ్ సర్కార్ను మద్యం సిండికేట్ వ్యవస్థ మోస్తోందని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలను సైతం  ముఖ్యమంత్రి చూసుకుంటారన్న భరోసాతో మద్యం సిండికేట్లు వ్యవహరిస్తున్నారని భుమన వ్యాఖ్యానించారు.  ఒక్కరోజుతో  ఆందోళన విరమించబోమని, ఎల్లుండి నుంచి రెండు రోజులు పాటు గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు.

మహాధర్నాకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మద్యం బాటిళ్లను మహిళలు ధ్వంసం చేశారు. ఆదాయమే పరమావధిగా భావిస్తున్న కిరణ్ సర్కారు వైన్ షాపులను కూడా బార్లుగా మార్చుతుండడం సిగ్గుచేటని మహిళలు మండిపడ్డారు. ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో ఇప్పుడు మంచినీళ్లు దొరక్కపోయినా మద్యం మాత్రం ఫుల్‌గా దొరుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు