మలేషియాలో ఉద్యోగాల పేరిట టోకరా

26 Jun, 2014 02:41 IST|Sakshi

చిత్తూరు (అర్బన్): ఒక విద్యార్థి (చంద్ర) ఎంబీఏ పూర్తి చేశాడు. మరో విద్యార్థి (కుమార్) డిగ్రీ పాసయ్యాడు. ఇద్దరూ స్నేహితులు. కాపురం ఉండేది పెనుమూరు మండలం. ఉండే ఊర్లో ఉద్యోగం చేస్తే కాస్త తక్కువ జీతాలు వస్తాయని భావించి విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.

ఇంతలో శరవణకుమార్ అనే వ్యక్తి తానో కన్సల్టెన్సీ పెట్టుకున్నానని, మలేషియాలోని ఓ స్టార్ హోటల్‌లో ఎంబీఏ చదివిన వ్యక్తికి సూపర్‌వైజర్ పోస్టు, డిగ్రీ చదివిన వ్యక్తికి అకౌంటెంట్ పోస్టు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇద్దర్నీ మధురైలోని దిండుగల్లు రమ్మన్నాడు. ఉద్యోగాల కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అక్కడున్న పరిస్థితిని చూసి తమకు మలేషియాలో ఉద్యోగాలు వచ్చేస్తాయని నమ్మారు. ఒక్కో ఉద్యోగానికి రూ.1.5 లక్షలు డిమాండ్ చేయడంతో ఊరికి వెళ్లి డబ్బులు సర్దుకుని ఫోన్ చేస్తామని చెప్పారు.

విషయం తల్లితండ్రులకు చెప్పడంతో ఉన్న సొమ్ములు తాకట్టుపెట్టి ఇద్దరూ రూ.1.15 లక్షల వంతున ఇచ్చా రు. వచ్చిన నగదును శరవణకుమార్‌కు చేతికి ఇస్తే ఎలాంటి ఆధారం లేకుండా పోతుందని ఆన్‌లైన్ నుంచి ఎదుటి వ్యక్తి ఖాతాకు రూ.2.3 లక్షలను బదిలీ చేశారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తోంది. శరవణకుమార్ నుంచి ఎలాంటి ఫోన్లూ రాలేదు. ఈ-మెయిల్స్‌కు సమాధానమూ లేదు.

దీంతో చేసేదేమీ లేక ఇద్దరు వ్యక్తులు బుధవారం చిత్తూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్నతాధికారులకు వివరాలు నివేదించడంతో దర్యాప్తు ప్రారభించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో గాలాలు వేసి వచ్చినకాడికి దోచుకుని వెళ్లిపోతున్నాయని ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఎస్పీ రామకృష్ణ సూచించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

బాధ్యతలు చేపట్టిన ఆర్టీజీఎస్‌ నూతన సీఈవో

పొనుగుపాడు ఘటనపై స్పందించిన హోంమంత్రి

‘చంద్రబాబు డైరెక‌్షన్‌లో మందకృష్ణ మాదిగ’

‘వర్గీకరణకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదు’

వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం

గత ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా?

వ్యయమా.. స్వాహామయమా..?

వాహన విక్రయాల్లో అక్రమాలకు చెక్‌

అసెంబ్లీలో అనంత ఎమ్మెల్యేల వాణి

సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఫిర్యాదు చేయొచ్చు  

వివాదాస్పద స్థలం పరిశీలన

రూల్స్‌ బ్రేక్‌ .. పెనాల్టీ కిక్‌

‘సహృదయ’ ఆవేదన!

అబ్దుల్‌ కలాంకు సీఎం జగన్‌ నివాళి

పార్టీలకు అతీతంగా నవరత్నాలు : బుగ్గన

అక్రమాలకు కేరాఫ్‌ ఆటోనగర్‌

కల్తీ భోజనంబు..! 

కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు

నామినేటెడ్‌ పదవుల్లో యాభైశాతం వారికే

థ్యాంక్స్‌ టు జగనన్న

మాట ఇచ్చారు.. నెరవేర్చారు  

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రూ.కోట్లు కొట్టుకుపోయాయి

ఎయిర్‌ పోర్టు పరిధిలో 144 సెక్షన్‌

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

నీరు–చెట్టు పథకంతో టీడీపీ అవినీతి!

‘ఐలా’ లీలలు!

ఆధునికీకరిస్తే గండికి నీరు దండి

కలెక్టరేట్‌ ఖాళీ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?