జగన్‌పై హత్యాయత్నం కుట్ర చంద్రబాబుదే

3 Jan, 2019 12:06 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌

విశాఖపట్నం , పెదవాల్తేరు(విశాఖ తూర్పు): రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి కుట్ర పన్నింది ముమ్మాటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ ఆరోపించారు. ఎయిర్‌పోర్టులో సంఘటన జరిగినపుడు తాను పక్కనే ఉన్న ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు. సిట్‌ నివేదికను నగర సీపీ మహేష్‌ చంద్ర లడ్డా వెల్లడించిన నేపథ్యంలో సాక్షి మీడియాతో బుధవారం విజయప్రసాద్‌ మాట్లాడారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని స్పష్టం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన అటాక్‌ అన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతోనే జగన్‌మోహన్‌రెడ్డి తప్పించుకున్నారని తెలిపారు.

పోలీసులు మొదటి నుంచి ఈ కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా కత్తితో చేసిన దాడిని అవహేళన చేయడం హాస్యాస్పదం అన్నారు. ఈ దాడి కేసులో కూడా నిందను వైఎస్సార్‌ సీపీపైకి నెట్టేయాలని టీడీపీ నాయకులు ప్రయత్నించడం అన్యాయమన్నారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ నివేదిక ఇచ్చినా సరే టీడీపీకి అనుకూలంగా మార్చేసుకుందన్నారు. పుష్కరాల ఘటన దర్యాప్తు కూడా నిర్యీర్యం చేశారన్నారు. చైతన్యవంతులైన ప్రజలే త్వరలో తమ సత్తా చాటుతారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి మాట్లాడుతూ ఎయిర్‌పోర్టులో దాడి జరిగిన తరువాత పోలీస్‌లు మాట్లాడుతూ నిందితుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభిమాని అని ప్రకటించడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై థర్డ్‌ పార్టీతో విచారణ చేయాలని డిమాండ్‌ చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నారు. జగన్‌ సీఎం అవ్వకుండా అడ్డుకోవాలన్న కుట్రతోనే ఎయిర్‌పోర్టులో దాడి చేయించారని ఆమె ఆరోపించారు. విశాఖ పార్లమెంటరీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు కంట్రేడ్డి రామన్నపాత్రుడు మాట్లాడుతూ దాడి ఘటనకు సూత్రధారులెవరో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు