టీటీడీ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

22 May, 2020 21:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ : తిరుమల వెంకన్న ప్రసాదాన్ని కూడా తెలుగుదేశం రాజకీయం చేయటం బాధాకరమని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో శ్రీవారి ఏకాంతసేవ ప్రసాదాన్ని భక్తులకు అందించాలన్న సదుద్దేశాన్ని టీడీపీ తప్పుపట్టడం విడ్డూరంగా ఉంది. టీటీడీ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. అధికారంలో ఉండగా శ్రీనివాసుడి ఆభరణాలు మాయం చేయాలని చూసిన ఘనత చంద్రబాబుది. తిరువేంకటాదీసుడితో రాజకీయ ఆటలాడితే పుట్టగతులు ఉండవు. చదవండి: 'సొంత పార్టీకి చెందినవాడే దొంగదీక్ష అన్నాడు'

ఎల్లోమీడియా వ్యవహారాన్ని రాష్ట్రప్రజలు గమనిస్తున్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడితే దేవుడి కోర్టులో శిక్ష తప్పదు. ఉనికిని చాటుకొనేందుకే టీడీపీ ఏడుకొండలపై దుష్ప్రచారం మొదలుపెట్టింది. దేవదేవుడి ప్రసాదాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ ఛైర్మన్ లడ్డూ ధర తగ్గించారు. శ్రీవారి వైభవాన్ని దశ దిశలా చాటిచెప్పేందుకు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కృషిచేస్తున్నారు. సామాన్యభక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు సంస్కరణలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తుల మన్ననలు పొందే విధంగా టీటీడీ పాలన కొనసాగుతోంది' అంటూ మల్లాది విష్ణు పేర్కొన్నారు. చదవండి: రాజకీయ కార్యక్రమాలొద్దు: సజ్జల

మరిన్ని వార్తలు