‘ఆర్ పీలకు రూ.10వేలు గౌరవవేతనం’

12 Nov, 2019 14:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటతప్పని నాయకుడని మంగళవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ ఉడా కాలనీ 58వ డివిజన్‌లో భారీ ఎత్తున నిర్వహించిన ర్యాలీలోఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో పేద ప్రజలకు నేనున్నాను మీకు అంటూ సీఎం జగన్‌ అభయం ఇచ్చారని గుర్తుచేశారు. మహిళలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని తెలిపారు. ఆర్ పీలకు రూ. 10వేలు గౌరవవేతనం జీవోను అమలు చేయడంపై ఉద్యోగస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా సీఎం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. నగరంలో 434 మంది ఆర్ పీలు భారీ ఎత్తున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటాన్ని పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్.పీలు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఆర్‌పీలు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఆర్ పీలకు గౌరవ వేతనం అందించలేదని ఆర్‌ పీలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 1వ తేదీ నుంచి రూ. 10వేలు జీవోను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఆర్ పీలు అందరూ రుణపడి ఉంటారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని.. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆర్‌పీలు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు