తీర్పుతోనైనా తెరపడేనా?

10 Aug, 2018 13:38 IST|Sakshi

బయటి నుంచి తినుబండారాలు, పానీయాలుఅనుమతించాలని ఆదేశం

కూల్‌డ్రింక్‌ కంపెనీలకు భారీ వడ్డన

కంపెనీకి రు.5 లక్షల చొప్పున రూ.25లక్షల జరిమానా

మల్టీఫ్లెక్స్‌లకు ఫోరం  మొట్టికాయ

జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి తీర్పుతోనైనా విజయవాడలోని మల్టీఫ్లెక్స్‌ థియేటర్లు, మాల్స్‌లో దోపిడీకి తెరపడుతుందేమోనని ప్రజలు భావిస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న సెలక్ట్‌ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఫోరం ఆదేశించింది. తినుబండారాలు, పానీయాలపై మార్కెట్‌ కంటే అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో ఫిర్యాదుదారుడికి తిరిగి చెల్లించాలని çహుకుం జారీ చేసింది.

సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు మేరకు అన్ని థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌లలో బయటి నుంచి తినుబండారాలు, నీరు, పానీయాలు అనుమతించాలని.. వినియోగదారులకు నీరు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే ఎవరైనా ఫిర్యాదు చేయడానికి అనువుగా అన్నిచోట్లా తూనికలు, కొలతల శాఖ అధికారుల ఫోన్‌ నంబర్లున్న బోర్డులుంచాలన్నారు.  ధరల పట్టికను కూడా ప్రముఖంగా కన్పించేలా ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నింటినీ అమలయ్యేలా చూడాల్సినబాధ్యత తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు.

స్నాక్స్‌ పేరుతో దోపిడీ....
రోజువారీ సాధక  బాధల నుంచి సగటు జీవికి ఊరట ఉపశయాన్ని ఇచ్చే ‘సినిమా’ ప్రియంగా మారింది. ప్రేక్షకులకు కార్పొరేట్‌ మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌లోకి వెళ్లకముందే సినిమా చూపిస్తున్నాయి. పెద్ద హీరో సినిమాకు టికెట్లతో పాటు కాంబో ప్యాక్, అర్డనరీ ప్యాక్‌ కొనుగోలు తప్పని సరి చేస్తున్నాయి. అప్పటికే  చేతిచమురు వదిలించుకున్నప్పటికీ  ఇంటర్వెల్‌లో అసలు సినిమా మొదలవుతోంది. కేవలం స్నాక్స్‌కే రూ.800 నుంచి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది.

పెద్ద హీరో సినిమాలయితే..
పెద్ద హీరో సినిమా రిలీజ్‌ అయితే మాత్రం అభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మల్టీప్లెక్స్‌ థియేటర్లలోనే అభిమాన హీరోల సినిమాల రిలీజ్‌ అవుతుండడంతో అక్కడే వెళ్లి సినిమా చూడాల్సి వస్తోంది. . కేవలం పాప్‌ కార్న్‌ , కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ చేతిలో పెట్టి రూ.600 వంతున వసూళ్లు చేస్తున్నారు. థియేటర్‌లలో  టికెట్‌ రూ.150 వంతున వసూళ్లు చేస్తుండగా కాంబో పేరుతో స్నాక్స్‌ అంటూ మరో రూ.450  అదనంగా పెంచి టికెట్లు ఇస్తున్నారు.

ఎవరు చెప్పినా..
విజయవాడ నగరంలో 5 మల్టీఫ్లెక్స్‌ థియేటర్లు ఉన్నాయి.. అందులో ఒక్కో మల్లీప్లెక్స్‌లో  సగటున 6 స్కీన్స్‌ ఉన్నాయి.. ప్రతి చోట స్నాక్స్‌ పేరుతో అడ్డుగోలు దోపిడి చేస్తున్నారు.  థియేటర్‌ వెలుపల కొనుగోలు  చేసినా ఏ తినుబండార మూ లోనికి అనుమతించడం లేదు. థియేటర్‌ క్యాంటీన్‌లోనే  కొనుగోలు చేయాలి. ఆఫ్‌ లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.50.. చిన్న పాప్‌కార్న్‌కు రూ.170 , కోల్డ్‌ కాఫీ రూ.150, పిజ్జా, కోక్‌ రూ.200 , స్వీట్స్‌ కేక్స్‌ రూ.80 ఇలా 28 రకాల పుడ్‌ ఐటమ్స్‌ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ రూ. 100 నుంచి రూ.300 పైనే నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. ప్రతి స్నాక్స్‌పై జీఎస్‌టీ బాదుడు అధనమే. గతంలో  సెలక్ట్‌ చానల్‌ దోపిడికి జిల్లా కలెక్టర్‌ లక్ష్మీ కాంతం కళ్లెం  వేస్తానంటూ హడాహుడి చేసినా ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. కొన్ని మల్టీప్లెక్స్‌లలోకి  బయట నుంచి వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లేందుకు అనుమతి  మాత్రమే ఇప్పించగలిగాడు.  రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు పలుమార్లు కాళ్లు నొప్పుట్టేలా తనిఖీలు చేసినా ధరలు మాత్రం యథా«తథంగా ఉన్నాయంటే వారి అసమర్థతా ?. అధికారుల నిర్లక్ష్యమా..? అనేది నగరంలో చర్చగా మారింది..

పార్కింగ్‌ పేరుతో దోపిడీ...
మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్‌ పేరుతో దోపిడి చేస్తున్నారు. పార్కింగ్‌ వసతి ఉన్న చోట్ల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయకూడదు.. అయినా నిర్వహకులు యథేచ్చగా వాహనదారులు నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.. మాల్స్‌లో ద్విచక్రవాహనానకి రూ.20, కారు అయితే రూ.40 వంతున నిబంధనలకు విరుద్దంగా వసూళ్లు చేస్తూ పక్కా దోపిడికి పాల్పడుతున్నా పట్టించుకోనే వారు కరువయ్యారు.

మరిన్ని వార్తలు