ఫేస్బుక్లోఅశ్లీల పేజీలు.. యువకుడి అరెస్ట్

12 May, 2015 10:41 IST|Sakshi
ఫేస్బుక్లోఅశ్లీల పేజీలు.. యువకుడి అరెస్ట్

జుగుప్స కలిగించేలా చిన్నపిల్లల ఫొటోలు.. వాటిని గురించి అత్యంత నీచమైన రాతలు.. ఇలా ఫేస్బుక్లో అశ్లీల వెబ్ పేజీలను సృష్టించి ఆనందిస్తోన్న మానసిక ఉన్మాదిని.. ఫేస్బుక్ సంస్థ సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన 27 ఏళ్ల యాదవ మణికంఠ గత కొద్దికాలంగా ఫేస్బుక్లో అశ్లీల పేజీలను సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు.

ఇతగాడి పేజీల్లో చిన్నపిల్లల ఫొటోల్ని అత్యంత దారుణంగా చూపించేవాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చెన్నై సీబీ సీఐడీ పోలీసులు.. సోమవారం అతణ్ని తిరుపతిలో అరెస్టుచేసి చెన్నై కోర్టుకు తరలించారు. ప్రస్తుతం నిందితుణ్ని జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడని, సదరు పేజీలకు ఆన్లైన్ నుంచి తొలిగించామని  సీబీ సీఐడీ అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు