మా ఊరికి మృతదేహం చేర్చండి

2 Sep, 2018 07:59 IST|Sakshi

రైలు కిందపడి అంతరకుడ్డ వాసి మృతి

హైదరాబాద్‌ నుంచి పలాస వచ్చి ఆత్మహత్య 

నా మృతికి నా భార్య, ఆమె సోదరుడే కారణం అంటూ వెల్లడి

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 4వ వార్డు అంతరకుడ్డకు చెందిన కుసుమూరు ప్రకాష్‌(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నుంచి పలాస వచ్చిన ఇతడు ఇక్కడ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తన మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాలని సూసైట్‌నోట్‌ రాసుకున్నాడు. ఈ సంఘటన పలాసలో సంచలనం కలిగించింది. జీఆర్‌పీ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. అంతరకుడ్డకు చెందిన కుసుమూరు ప్రకాష్‌ ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. 

ఇతనికి భార్య లక్ష్మి, కుమార్తె మనిదీపిక(11), కుమారుడు మనిదీపక్‌(10) ఉన్నారు. సుమారు 20 ఏళ్ల కిందటే ఇతడు స్వగ్రామాన్ని విడిచి ఉపాధి కోసం భార్యతో కలిసి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. అక్కడ నిత్యం కూలీ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏమైందో ఏమో గాని హైదరాబాద్‌ నుంచి పలాస శనివారం వచ్చి స్వగ్రామానికి నాలుగు కిలోమీటర్లకు దూరంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లూప్‌లైన్‌ట్రాక్‌ రూట్‌ నంబర్‌ 9లో తలపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్‌లో భార్య, పిల్లలను విడిచిపెట్టి ఇతడు ఒంటరిగా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

తన భార్య లక్ష్మి, ఆమె సోదరుడు రమేష్‌ నా మరణానికి కారణం అని, నా మృతదేహాన్ని స్వగ్రామం అంతరకుడ్డ చేర్చండని సూసైడ్‌నోట్‌ రాసి మృతుడు తన వద్ద ఉంచుకున్నాడు. ఈ సూసైట్‌నోట్‌ను జీఆర్‌పీ ఇన్‌వెస్ట్‌గేషన్‌ అధికారి పి.కోదండరావు తీసుకొని నిర్ధారించారు. అయితే మొండెం నుంచి పూర్తిగా తల వేరయింది. జీఆర్‌పీ పోలీసులు సిబ్బందితో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఘటనపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఉద్యోగుల నిర్లక్ష్యం
పలాస రైల్వే స్టేషన్‌ లూప్‌లైన్‌ రూట్‌ నంబరు 9లో మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రకాష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమీపంలో ఉన్న క్యారియింగ్‌ వేగన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది, కీమెన్‌ మృతదేహాన్ని చూసినప్పటికీ పోలీసులకు సమాచారం అందిస్తే కోర్టులకు పిలుస్తారనే భయంతో వారు తెలియజేయలేదు. దీంతో సాయంత్రం 5 గంటల వరకు ఎండలో మృతదేహం అలా మిగిలిపోయింది. రెండవ నంబరు ఫ్లాట్‌ఫాంకు మృతదేహం కనిపిస్తున్నప్పటికీ, పక్కనే స్టేషన్‌ లగేజీ తరలించే రోడ్డు కూడా ఉంది. వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతున్నప్పటికీ ఏ ఒక్కరూ సమాచారం ఇవ్వడానికి సాహసించలేదు. విషయం తెలుసుకున్న విలేకరులు అక్కడికి చేరుకోవడంతో జీఆర్‌పీ అధికారి పి.కోదండరావు సిబ్బందితో చేరుకుని మృతదేహాన్ని తీసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

4రోజుల్లో 2 లక్షలమంది దరఖాస్తులు

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

అగ్రిగోల్డ్‌పై సీఐడీ కీలక సమావేశం

ముంపు ప్రాంతాలపై చర్యలు చేపట్టండి

అదే భవిష్యత్‌ తరాలకు మనమిచ్చే గొప్ప ఆస్తి : జగన్‌

పార్లమెంటులో అల్లూరి విగ్రహం..!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆ ఇంటిని చంద్రబాబు తక్షణం ఖాళీ చేయాలి!

బాధ్యతలు స్వీకరించిన సజ్జల రామకృష్ణారెడ్డి

రాజ్యసభ ముందుకు రైల్వే ప్రయాణీకుల సమస్యలు

‘బాబు దుబారాకు ప్రజావేదిక ఓ నమూనా’

పెళ్లి చేసుకుంటానని మోసం

విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

నందిగం సురేష్‌కు మరో పదవి

గ్రామ వాలంటీర్ల ప్రకటన

మహిళను మోసగించిన వ్యక్తిని...

ఎట్టకేలకు దొరికాడు

దేవుడి భూమిలోనూ అక్రమంగా.

పెన్నా పాపం టీడీపీదే

భారీ భద్రత నడుమ ప్రజావేదిక తొలగింపు పనులు

సీఎం గొప్ప బహుమతిచ్చారు

గీత దాటితే మోతే

డివైడర్‌ లేక ప్రమాదాలు

అక్రమ చెరువుల దందా

కోనేరులో ఇద్దరు యువకులు మృతి..

అక్కడ స్వీపర్లే నర్సులు..!

బెజవాడలో బైక్‌ రేస్‌లు

ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుల పిల్లలు

సేంద్రియ ‘స్వాహా’యం!

సివిల్స్‌ టోపీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నీరు మున్నీరైన కృష్ణ

చిరు స్పీడు మామూలుగా లేదు

విజయ నిర్మల మృతికి ‘ఆటా’ సంతాపం

నల్లగా ఉంటే ఏమవుతుంది?

నేను బాగానే ఉన్నా: అనుష్క

శేఖర్ కమ్ముల కొత్త సినిమా ప్రారంభం