క్షణికావేశం..పోయిందో చిన్నారి ప్రాణం

4 Sep, 2019 09:26 IST|Sakshi

బిడ్డకు విషపు గుళికల మందు ఇచ్చి

తానూ సేవించిన ప్రబుద్ధుడు

తీవ్ర అస్వస్థతతో చిన్నారి మృత్యువాత

చిన్నారి తండ్రి పరిస్థితి విషమం

దంపతుల మధ్య గొడవే కారణం?

సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : భార్యతో గొడవ పడి ఓ ప్రబుద్ధుడు క్షణికావేశంలో తాను క్రిమి సంహారక మందు సేవించాడు. తన బిడ్డకూ అదే మందును మింగించ డంతో ఆ చిన్నారి మృత్యువాత పడింది. అతడు పరిస్థితి విషమిం చి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన గుర్రంకొండ మండలం లో చోటుచేసుకుంది. వివరాలు..గుర్రంకొండ మండలం వంకా యలోళ్లపల్లెకు చెందిన దంపతులు ఆదీశ్వర్, నందినికి ఇద్దరు ఆడపిల్లలు, రెండవ కుమార్తె రాజశ్రీ (17 నెలలు). మంగళవారం సాయంత్రం ఊరికి సమీపంలో తమ పొలం వద్దకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లారు.

తమవెంటే రాజశ్రీనీ అక్కడికి తీసుకెళ్లారు. భార్యతో గొడవపడిన ఆదీశ్వర్‌ విషపు గుళికల మందును సేవించాడు. అంతేకాకుండా రాజశ్రీకి కూడా తాగించాడు. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆ చిన్నారి కన్నుమూసింది. ఇక, ఆదీశ్వర్‌ను గ్రామం నుంచి నేరుగా తిరుపతికే తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలి సింది. పొరబాటున చిన్నారి గుళికల మందు మింగిందని చెప్పినప్పటికీ ఆదీశ్వరే  తాగించాడనే విషయం బైటపడింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా