చంద్రగిరి జన్మభూమి సభలో కలకలం

6 Jun, 2015 14:15 IST|Sakshi

చంద్రగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో జన్మభూమి సభలో కలకలం రేగింది. జిల్లా పరిధిలోని చంద్రగిరిలో శనివారం జరిగిన జన్మభూమి సభలో దళిత కులానికి చెందిన బాల సుబ్రమణ్యం అనే వ్యక్తి తనకు న్యాయం జరగాలంటూ ముగ్గురు చిన్నారులతో సహా ఒంటి పై కిరోసిన పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమిని అగ్ర కులాల వారు కబ్జా చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ బాలసుబ్రమణ్యం ఆరోపించాడు. విచారణ చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు