తల్లిని నదిలో తోసేసిన ప్రబుద్ధుడు

30 Oct, 2014 09:29 IST|Sakshi
తల్లిని నదిలో తోసేసిన ప్రబుద్ధుడు

కర్నూలు: కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని కుందూనదిలోకి తోసేశాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో ఆమె కుందూనదిలో పడిపోయింది. అనంతరం కొడుకు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆ విషయాన్ని గమనించిన స్థానికలు వెంటనే నదిలో నుంచి ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చారు.  అనంతరం  స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి... ప్రాధమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తిని తన పేరిట రాయాలని గత కొంత కాలంగా కొడుకు.... కన్న తల్లిని వేధించసాగాడు. ఆ క్రమంలో తరచుగా ఇంట్లో గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు ఉదయం పని ఉంది రమ్మంటూ తనను బయటకు తీసుకువెళ్లాడని .... కుందూనది వద్దకు చేరుకోగానే ... ఒక్కసారిగా తనను నదిలోకి తోసేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. పోలీసులు పరారైన కోడుకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు