తెలుగు తేజం మానస

3 Jul, 2018 12:34 IST|Sakshi

ఆమె అడుగులు నటరాజకు నాట్యాభిషేకం చేస్తాయి.ఆమె పాద మంజీరాలు భరతముని నాట్యాశాస్త్రానికి చిరునామాగామారుతాయి. ఆమె ప్రదర్శించే అంశాలు భారతీయ నృత్య సంప్రదాయ విలువలను చాటుతాయి. ఆమె ప్రముఖ నాట్య కళాకారిణి అచ్యుత మానస, నగరానికి చెందిన అచ్యుత మానస  ఈ నెల  4 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు గ్రీసులోని ప్రపంచ ప్రఖ్యాత ఎథెన్స్‌ ప్రాంతంలో 51 అంతర్జాతీయ  వేదికమీద కూచిపూడి నాట్యంలోని తరంగం అంశంగా  ప్రదర్శన(అంతర్జాతీయ డాన్స్‌ కౌన్సిల్‌) ఇవ్వటానికి వెళుతున్నసందర్భంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

విజయవాడ కల్చరల్‌: 25 సంవత్సరాల నాట్యప్రస్ధానం, ఆరేళ్ల వయస్సులోనే నృత్యంలో శిక్షణ ప్రారంభం, తల్లి రాజ్యలక్ష్మి తండ్రి రవిచంద్ర(పోలీస్‌ ఉన్నతాధికారి)ప్రేరణతో నాట్యరంలోకి ప్రవేశించిన అచ్యుత మానస నాట్యాచార్యులు కాజ వెంకటసుబ్రహ్మమణ్యం పర్యవేక్షణలో కూచిపూడి, భరతనాట్యం, కథక్‌ అంశాలను అలవొకగా ప్రదర్శంచగల తెలుగు తల్లి ముద్దుబిడ్డ అచ్యుత మానస. నాట్యమేకాదు, అటు చిత్రలేఖనం, సంగీతం, యోగాలో విశేష ప్రతిభ కనపరుస్తున్న అచ్యుత మానస దేశవిదేశాలలో 1200పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

పురస్కారాలు
యునెస్కో బెస్ట్‌ కల్చరల్‌ అంబాసిడర్‌గా ఎంపిక, 2016లో నాట్యరంలో ఉగాది పురస్కారం, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలు, కళాసరస్వతి, నాట్యమయూరి, నాట్యకళామయి బిరుతులతో సత్కరించాయి.

ఉచిత శిక్షణ
కూచిపూడి మై లైఫ్‌ పేరుతో దిగువ తరగతికి వారికి నాట్యంలో శిక్షణ ఇచ్చివారిని అంతర్జాతీయ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో కొత్తగా కూచిపూడి నాట్య కళాక్షేత్ర అనే నృత్య అకాడమీని స్థాపించారు.

ఔత్సాహికుల కోసం సీడీల నిర్మాణం
భావితరాలకు భారతీయ నృత్య సంప్రదాయమైన కూచిపూడిని అందించటానికి కూచిపూడి నాట్యాభినయ వేదం మోక్షం అనే సీడీని తయారుచేసి జీయర్‌ స్వామి, దర్శకుడు విశ్వనా«థ్, విశ్వంజీ చేతులమీదుగా ఆవిష్కరించి దాని ద్వారా వచ్చిన సొమ్మును మై లైఫ్‌ పేరుతో శిక్షణ తీసుకొనే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు.

అంతర్జాతీయ వేదికపై తెలుగు ప్రతినిధిగా..
జూలై 4 నుంచి 8వ తేదీ వరకు ఎథెన్స్‌(అంతర్జాతీయ స్టేడియం)లో 51వ అంతర్జాతీయ డాన్స్‌ రెసెర్చి సంస్థ 50 దేశాల ప్రతినిధులతో సమ్మేళనం నిర్వహిస్తోంది. అదే వేదిక మీద అచ్యుత మానస భారతదేశ ప్రతినిధిగా కూచిపూడి అంశంగా ప్రసంగించనున్నది.

జీవితాశయం
ఉన్నత విలువలుగల భారతీయ మహిళాగా ఎదగాలని, భారతీయ నృత్యసంప్రదాయ రీతులు ప్రపంచమంతా పాకాలని, అతి పేద వారికి కూడా సంప్రదాయ నృత్యరీతులను నేర్పించి భావితరాలకు ఉన్నత విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశయమని ఆమె వివరించారు.

మరిన్ని వార్తలు