శ్రీకాళహస్తిలో భయం.. భయం..

30 Aug, 2014 12:34 IST|Sakshi
శ్రీకాళహస్తిలో భయం.. భయం..

శ్రీకాళహస్తిలోని అష్టోత్తర లింగ మండపంలో మండపం స్తంభం శుక్రవారం రాత్రి ఒకవైపు ఒరిగిపోయింది. దాంతో భక్తులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. మండపం ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. రాళ్లు కూడా కింద పడటంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ మండపానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈ మండపం కిందనుంచే క్యూలైన్ల ద్వారా భక్తులు ప్రధాన ఆలయానికి వెళ్తుంటారు. దీనికి మరమ్మతులు చేస్తున్నామని, ఎలాంటి ప్రమాదం ఉండబోదని అధికారులు అంటున్నారు.

అయితే, ప్రముఖ వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో ఇంతకుముందు గాలిగోపురం కూలిపోయింది. దానికి ముందు కూడా అధికారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే చెప్పారు. కానీ అది కాస్తా కూలిపోయింది. అప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి కూడా చాలా సమయం పట్టింది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కట్టించిన గాలిగోపురం అప్పట్లో కూలిపోయింది. ఇప్పుడు అష్టోత్తర లింగ మండపం కూడా కూలిపోయే స్థితిలోనే ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు