మంత్రుల కమిటీ వేస్తామన్నారు: విజయమ్మ

27 Aug, 2013 12:30 IST|Sakshi
మంత్రుల కమిటీ వేస్తామన్నారు: విజయమ్మ

ఆంధ్రప్రదేశ్ విభజన ప్రకటన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై మంత్రుల బృందంతో కమిటీ వేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రధాని మన్మోహన్ సింగ్ హామీయిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. విభజన ప్రకటనతో రాష్ట్రం అగ్నిగుండంలా మారిందన్నారు. పార్టీ నాయకులతో ప్రధానిని కలిసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు.

న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని మన్మోహన్ సింగ్ను కోరామని విజయమ్మ తెలిపారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రపతిని కలిసి ఇదే విషయం చెబుతామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తమతో ప్రధాని అన్నారని విజయమ్మ వెల్లడించారు. మంత్రుల కమిటీ  వేస్తామని మన్మోహన్ తమకు హామీయిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు