కోస్తాంధ్రలో వడగాడ్పులు

6 Jul, 2015 01:16 IST|Sakshi
కోస్తాంధ్రలో వడగాడ్పులు

పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
* రానున్న నాలుగైదు రోజులూ ఇదే పరిస్థితి
* పశ్చిమ గాలుల వల్లేనంటున్న వాతావరణ నిపుణులు

సాక్షి, విశాఖపట్నం: జోరుగా వర్షాలు కురవాల్సిన జూలైలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఎండలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇలాంటి అనూహ్య పరిణామాలు వాతావరణ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

సాధారణంగా జూన్ రెండో వారానికల్లా తొలకరి ప్రవేశంతో వాతావరణం బాగా చల్లబడుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించినా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా జూలై ఆరంభం నుం చి మళ్లీ సెగలు మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితం ఒకట్రెండు చోట్ల మాత్రమే 40 డిగ్రీల దా కా రికార్డయిన ఉష్ణోగ్రతలు ఆదివారం నాటికి అనేక ప్రాంతాల కు విస్తరించాయి.

ఆదివారం ఒంగోలు, బాపట్ల, కావలి, నెల్లూరు, తిరుపతిలో 40, విశాఖపట్నం, తుని, మచిలీపట్నంలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్రలోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిలా ్లల్లో వడగాడ్పులు వీచినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న నాలుగైదు రో జులూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉం దని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
అత్యంత అరుదు..
జూలైలో అధిక ఉష్ణోగ్రతల నమోదుతో పాటు వడగాడ్పులు వీయడం అత్యంత అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో  ఇలాంటి పరిస్థితి చూడలేదని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త మురళీకృష్ణ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటిదాకా జూలైలో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 39.9 డిగ్రీలు. అది కూడా 1997 జూలై 16న నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతే అధికం కావడం విశేషం.
 
ఎందుకిలా..
ప్రస్తుతం రుతుపవనాలు హిమాలయ పర్వతాల వైపు ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. పైగా సముద్రం నుంచి గాలులు వీయడం లేదు. గాలిలో తేమ తక్కువ కావడం, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనంగా ఉండడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా క్యుములోనింబస్ మేఘాలేర్పడి రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆదివారం నాటి నివేదికలో తెలిపింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పార్లమెంట్‌ నియోజకవర్గానికో స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌

‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’

‘ఖబర్దార్‌ మందకృష్ణ.. అడ్డుకుని తీరతాం’

మూడేళ్ల సమస్య.. మూడు నిమిషాల్లో పరిష్కారం  

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు

‘జర ఓపిక పట్టు తమ్మీ’

సంగం డెయిరీ భారీ చోరీని ఛేదించిన పోలీసులు

కరువు సీమలో కాలా ట్యాక్స్‌! 

కుయ్‌..కుయ్‌..ఇక రయ్‌..రయ్‌

లక్షల్లో అవినీతి... వందల్లో రికవరీ 

బీపీ‘ఎస్‌ అనరే’..!

7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు

ఏసీబీ దాడులు.. నగదు స్వాధీనం

గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా?

ఎన్నిసార్లు చెప్పినా మారరా?

మార్చురీ పక్కన అన్నా క్యాంటీన్‌

ఎంబీబీఎస్‌.. మ.. మ.. మాస్‌! 

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

మితిమీరిన ఆకతాయిల ఆగడాలు

ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగాలి

స్కూల్‌ టైమ్‌లో ఫోన్‌ వాడితే కఠిన చర్యలు

మా సీటు.. యమ స్వీటు.. 

దీపం ఉండగానే.. ఇల్లు చక్కబెట్టుకున్న తమ్ముళ్లు!

వశిష్ట వంతెన కోసం గళమెత్తిన ముదునూరి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

చిరుతపులి పేరున భయపెడ్తూ దోచేస్తున్నారు..!

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ..

వినూత్న రీతిలో టిక్‌టాక్‌ చేద్దామని అడవికి వెళ్లి..

స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్లు రద్దు చేయండి

నిరుద్యోగులకు టోపీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?