పలు రైళ్లు రద్దు

13 Oct, 2013 02:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: పై-లీన్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను శని, ఆదివారాల్లో రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ డివిజన్‌లలోని 19 రైల్వే స్టేషన్‌లలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో.. ప్రయాణాలను రద్దు చేసుకొనేందుకు, టిక్కెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు  అదనపు కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం మీదుగా ఒడిశా మార్గంలో కొద్దిరోజులపాటు రైళ్లు నడపడం కుదరదని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది.


 ఆదివారం రద్దయిన రైళ్లు: బెంగళూరు-భువనేశ్వర్ (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భునేశ్వర్-బెంగళూరు (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్-యశ్వంత్‌పూర్, పూరి-ఓకా, పూరి-చెన్నై, భువనేశ్వర్-బెంగళూర్, భువనేశ్వర్-తిరుపతి, భువనేశ్వర్-సికింద్రాబాద్, భువనేశ్వర్-విశాఖ (ఇంటర్‌సిటీ), విశాఖ-భువనేశ్వర్(ఇంటర్‌సిటీ), భువనేశ్వర్-జగదల్‌పూర్(హీరాఖండ్), అహ్మదాబాద్-పూరీ, ముంబై-భువనేశ్వర్, పూరి-తిరుపతి.


 ప్యాసింజర్ల రద్దు: ఆదివారం విశాఖ-మచిలీపట్నం(57230) ప్యాసింజర్‌ను విశాఖ, రాజమండ్రి మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. పలాస-విశాఖపట్నం-పలాస, పూరి-గుణుపూర్-పూరి, పలాస-గుణుపూర్-పలాస, విజయనగరం-విశాఖపట్నం-విజయనగరం మధ్య అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.


 విమానాలకూ దెబ్బ: ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. ఎయిర్ ఇండియా, ఇండి గో, జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన దాదాపు 10 విమాన సర్వీసులను రద్దు చేశారు. విశాఖ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేశారు.
 
 రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు
 
 సికింద్రాబాద్    : 040-27700868
 నాంపల్లి    :    040-23200865
 విజయవాడ    :0866-2575038
 రాజమండ్రి    :0883-2420541, 2420543
 కాజీపేట్    :    0870-2548660
 వరంగల్    :    0870-2426232
 ఖమ్మం    :    08742-256025
 మంచిర్యాల    :08736-250081
 తుని    :    08854-252172
 అనకాపల్లి    :08924 -221698
 గుంటూరు    :0863-2222014,09701379072
 నంద్యాల    :07702772080
 నల్లగొండ    :08682-224392,09701379077
 నరసరావుపేట:    08647-223131,     09701379075
 మార్కాపురం    :08596-222028, 09701379079
 గిద్దలూరు    :08405-242003
 సత్తెనపల్లి    :08641-232255
 పిడుగురాళ్ల    :08649-252255
 నడికుడి    :    08649-257625,    09701379078
 

మరిన్ని వార్తలు