ఏవోబీలో అలజడి.. కూంబింగ్‌ ముమ్మరం

2 Dec, 2018 09:09 IST|Sakshi

నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు

భారీగా మోహరించిన పోలీసు బలగాలు

సాక్షి, శ్రీకాకుళం : నేటి నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్టీ వారోత్సవాలు సందర్భంగా మావోయిస్టులు ఘాతుకాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఏవోబీలో భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల జరిగిన పలు ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రతినిధులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని కోండ్రుం-ఇంజరి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శనివారం భారీ మందుపాతరలను పేల్చిన విషయం తెలిసిందే.

వారోత్సవాలకు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో హాజరవుతారనే పక్కా సమాచారంతో బలగాలు గత రెండురోజులుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మందుపాతరలను పేల్చినట్లు తెలిసింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న బలగాలకు హెచ్చరికగా ఒడిషాలో మావోయిస్టులు రోడ్డు నిర్మాణం జరుపుతున్న వాహానాలకు దహనం చేశారు.  దీంతో ఏవోబీ ప్రాంతంలో ప్రజలకు భయాందోళలకు గురవుతున్నారు. ఆంధ్రా, ఒడిషా, ఛత్తీసగఢ్‌, ప్రాంతాల్లో బలగాలు గాలింపు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు