ఓటు కోసం కదలండి

7 Mar, 2014 02:27 IST|Sakshi
ఓటు కోసం కదలండి
 ఓటు వజ్రాయుధం. మన తలరాతను మార్చే సాధనం. ఓటు ఉంటేనే హక్కులు సాధించుకోగలం. నేతలనూ నిలదీయగలం. అర్హత వున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయినప్పుడే ఇది సాధ్యం.  ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం, వినియోగించాల్సిన అవసరం వచ్చేసింది. మే 7న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే  ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆ జాబితాలో  మీ పేర్లు ఉంటే సరి. లేని పక్షంలో నమోదుకు ఒక రోజు అవకాశం కల్పించారు. మార్చి 9న కొత్త ఓటుకోసం దరఖాస్తు చేయవచ్చు. 
 
 అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్: నగరపాలక సంస్థలో ఓటరు దరఖాస్తులు స్వీకరిం చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఏర్పాట్లు చేశారు. కొత్తగా నమోదు కావాల్సి ఉన్నా, ఒక వేళ ఓటర్ల జాబి తాలో పేర్లు గల్లంతయినా, నగరంలో ఒక ప్రాం తం నుంచి మరొక ప్రాంతానికి ఇల్లు మారినా, మీ పేర్లు కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. 
 = ఓటు కోసం దరఖాస్తు చేసుకొనే వారు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి.
 = కొత్తగా ఓటుకోసం దరఖాస్తు చేసుకొనే వారు  ఫారం-6 పూర్తిచేయాలి. 
 = రెండు స్టాంప్‌సైజు ఫొటోలు ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది.  
 
మరిన్ని వార్తలు