2020కి గుండుగొలను–కొవ్వూరు హైవే పూర్తి

27 Aug, 2019 09:59 IST|Sakshi
దేవరపల్లి–గోపాలపురం రోడ్డులో ఫ్లైఓవర్‌ను పరిశీలిస్తున్న ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ 

సాక్షి, దేవరపల్లి: 2020 డిసెంబరు నాటికి గుండుగొలను–కొవ్వూరు జాతీయరహదారి నిర్మాణం పూర్తవుతుందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తెలిపారు. దేవరపల్లి–గోపాలపురం మధ్య జరుగుతున్న రహదారి విస్తరణ పనులు, ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని సోమవారం ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్‌ మాట్లాడుతూ 2020 డిసెంబరు 31 నాటికి రోడ్డు విస్తరణ, బైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. రోడ్డు నిర్మాణంపై ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. మంత్రి ఇచ్చిన సమాధాన పత్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి అందజేసినట్టు చెప్పారు.

గుండుగొలను– కొవ్వూరు మధ్య సుమారు 70 కిలోమీటర్లు నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నట్టు ఆయన తెలిపారు. 70 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 28 ఫ్లై ఓవర్‌ వంతెనల్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రహదారి నిర్మాణం 25 శాతం పూర్తయిందని వివరించారు. పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ భరత్‌రామ్‌ అధికారులకు సూచించారు. గుండుగొలను–కొవ్వూరు వరకు గల ప్రస్తుత రోడ్డును అధికారులు సర్వే చేశారని, రోడ్డు అధ్వానంగా ఉన్నందున నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.

తల్లాడ–దేవరపల్లి రోడ్డు మరమ్మతులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడి నిధులు మంజూరుకు కృషచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ భరత్‌రామ్‌ను కోరారు. కార్యక్రమంలో జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.కె దుర్గారావు, నరహరిశెట్టి రాజేంద్రబాబు, మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్, నాయకులు పాల్గొన్నారు. 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది

దిగరా నాయనా.. నీ ‘పెళ్లి’ తప్పక చేస్తాం..!!

మాయమవుతున్న మాంగనీస్‌

కొండను పిండేందుకు కొత్త కసరత్తు

కోడెల కుమార్తెపై కేసు నమోదు

మిస్టరీగా మారిన జంట హత్యలు

సముద్రం మధ్యలో నిలిచిన చెన్నై వేట బోట్లు

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

పటమట సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌పై ఏసీబీ దాడి

వెంకన్న సొమ్ముతో.. చంద్రన్న సోకులు..!

హైకోర్టును ఆశ్రయించిన కోడెల

చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు

తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య 

తాడేపల్లిలో పేలుడు కలకలం!

అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలింపు

అసభ్యకరంగా మాట్లాడాడని..

ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే.. 

నిత్యం భయం.. జీవనం దుర్భరం

రేపు విశాఖకు ఉప రాష్ట్రపతి రాక

రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పోర్టులో మరో ప్రమాదం

‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

రాజధానిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌

నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ

రూ.30 వేల కోట్లు ఇవ్వండి

మత్స్యకారులే సైనికులు..

వైఎస్సార్‌ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!