ఇక నుంచి 'ఫాం టు హోం'

4 May, 2016 13:57 IST|Sakshi

చోడవరం: విశాఖపట్నం జిల్లా చోడవరం మార్కెట్‌యార్డును రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి. మల్లికార్జున రావు బుధవారం పరిశీలించారు. కొత్తగా ‘ఫాం టు హోం’ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ద్వారా రైతుల నుంచి ప్రత్యక్షంగా కూరగాయలను సేకరించి అమ్మకాలు సాగించవచ్చన్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఈ పథకం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 270 మార్కెట్‌యార్డుల్లో ప్రస్తుతం 80 మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయని, మిగతా వాటిని కూడా త్వరలోనే ఆధునీకరిస్తామని తెలిపారు. ఈ-పర్మిట్ విధానాన్ని త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. అనంతరం అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను పరిశీలించడానికి కమిషనర్ బయలు దేరారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు