పెళ్లికి శుభలేఖే ‘ఆధార్‌’

23 Jan, 2017 11:57 IST|Sakshi

రాజమహేంద్రవరం : మనిషన్నాక.. కూతంత కళాపోషణ ఉండాలి.. ఓ సినిమాలో రావు గోపాలరావు చెప్పిన ఫేవరెట్‌ డైలాగ్‌.. దాన్ని ఫాలో అయ్యాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ న్యాయవాది. పెళ్లి శుభలేఖ అంటే ఇప్పటి వరకు పుస్తక రూపంలోనే కాకుండా ఎల్సీడీ స్క్రీన్ పై వీడియో రూపంలోనూ చూశాము. అదే శుఖలేఖను వెరైటీగా ముద్రించి అందరిని అబ్బురపరిచాడు కడియం మండలం బుర్రిలంకకు చెందిన న్యాయవాది కొత్తపల్లి మూర్తి.

ఫిబ్రవరి ఒకటిన జరిగే తన పెళ్లి శుభలేఖను రొటీన్‌గా కాకుండా కాస్త వెరైటీగా ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆధార్‌కార్డు రూపంలో ముద్రించాడు. మూర్తి తన స్నేహితుల ఇళ్లకు వెళ్లి కార్డులు ఇస్తుంటే అందరూ ముందు ఆధార్‌కార్డు ఇస్తున్నారేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. పరిశీలించాక..‘భలేగుంది’ అని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వార్తలు