న్యాయం చేయాలి

11 Sep, 2018 13:23 IST|Sakshi
న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన బాధిత వివాహిత

రోడ్డుపై బైఠాయించిన వివాహిత

శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: పట్టణంలోని బెల్లుపడ కాలనీకి చెందిన వివాహిత తనకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై సోమవారం ఉదయం బైఠాయించింది. ఈమెకు కొండివీధికి చెందిన మహిళలు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ లాబాల స్వరమణి మద్దతుగా నిలిచి రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు పది నిమిషాల పాటు అంతరాయం ఏర్పడడంతో స్థానిక సీఐ భవాని ప్రసాద్, రూరల్‌ ఎస్‌ఐ కోటేశ్వరరావు కలుగజేసుకొని ఆందోళనకారులతో మాట్లాడి ట్రాఫిక్‌ను సరిదిద్దారు. బాధిత మహిళ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఈమెకు పదేళ్ల కిందట బెల్లుపడ కాలనీకి చెందిన వ్యక్తితో వివాహమయింది. భర్త, ఇద్దరు పిల్లలతో ఇక్కడ నివాసముంటుంది. అయితే ఈమెపై ఇంటిలోనే ఆరు నెలల కిందట కొండివీధికి చెందిన నందిక శంకర్‌ అనే యువకుడు లైగింకదాడికి ప్రయత్నించగా కాలనీ ప్రజలు అడ్డుకున్నారు.

ఈ విషయమై బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శంకర్‌పై కేసు నమోదు చేసి అరెస్టుచేశారు. అయితే ఈ ఘటనతో తన భర్త తనకు విడాకులు ఇస్తానని, తన తల్లిదండ్రులు కూడా చూడరని ఇంటినుంచి పంపివేశాడు. నాపై లైంగికదాడి యత్నం జరగడంవల్లే నా భర్త నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేశారని దీంతో నేను నా పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచడంలేదని బాధిత మహిళ తెలి పింది. అందుకే నాకు అన్యాయం చేసిన నిందితు డు వివాహం చేసుకోవాలని, లేనిచో నేను నా పిల్లలతో జీవించేందుకైనా పరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. ఈ ఘటనపై గతంలో బాధిత మహిళ వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. అతనిపై మేము ఎటువంటి చర్యలు తీసుకోలేం అని సీఐ మహిళలకు తెలిపారు.

మరిన్ని వార్తలు