వివాహిత ఆత్మహత్య

19 Sep, 2015 18:04 IST|Sakshi

కృష్ణా: ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో మరియమ్మ అనే మహిళ శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడు లైంగికంగా తనను  వేధిస్తున్నాడని మరియమ్మ మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు