-

మాస్ కాపీయింగ్‌పై అప్రమత్తం

12 Mar, 2016 01:45 IST|Sakshi

ఎచ్చెర్ల :  డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీరుుంగ్ పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిశీ లకులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు సూచించారు. వర్శిటీ పరీక్షల నిర్వహణ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 17తో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు పూర్తవుతాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి రెండో ఏడాది, మొదటి ఏడాది బ్యాక్‌లాగ్ విద్యార్థుల పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు.

రెండో ఏడాది పరీక్షలకు 12,965 మంది హాజరు కానున్నారని, మొదటి సెమిస్టర్ ఇయర్ ఎండ్ బ్యాక్‌లాగ్ విద్యార్థులు 8437 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఆరోపణలు ఉన్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ప్రత్యేక స్క్వాడ్ బృందాలు సైతం పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు