నాలుగు రోజుల వ్యవధిలో రెండో ప్రమాదం

21 Jan, 2019 09:56 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌(ఎస్‌ఎమ్‌ఎస్‌) పిల్టర్‌ ప్లాంట్‌ 2లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం. స్టీల్‌ ప్లాంట్‌లో తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతుండటంతో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు