పడగవిప్పిన పాతకక్షలు

25 Apr, 2014 03:26 IST|Sakshi
పడగవిప్పిన పాతకక్షలు
  •      ఐదుగురికి తీవ్ర గాయూలు, ఆస్పత్రికి తరలింపు
  •      శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు, రెవెన్యూ అధికారులు విఫలం
  •      భూతగాదాలే ఘర్షణకు ప్రధాన కారణం
  •  రావుకుప్పం, న్యూస్‌లైన్: బందార్లపల్లె పంచాయుతీ పావునబోయునపల్లె గ్రావుంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు ఒక్కసారిగా భగ్గువున్నాయి.  గురువారం రెండు వర్గాలవారు రావుకుప్పం పట్టణ నడిబొడ్డున పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూ రంలో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు.  తీవ్ర రక్తగాయూలతో తలలు బద్దలయ్యేలా కొట్టుకున్నారు. ఈ ఘటన వుండలంలో సంచ లనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
     
    పావునబోయునపల్లె గ్రావూనికి చెందిన జనార్ధన్‌రెడ్డి, కుందనందారెడ్డిలతో పాటు కాశిరెడ్డి, ఆనందప్పల వుధ్య మూడేళ్లుగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయుంపై రెండు వర్గాల వారు పలువూర్లు ఘర్షణలు పడి పరస్పరం పోలీసులకు  ఫిర్యాదులు చేసుకున్నారు. అలాగే భూమూలు తవువంటే తవువే అంటూ ఇరువర్గాల వారు కోర్టులకెక్కారు. ప్రస్తుతం ఈ భూ సవుస్యలపై కోర్టులో విచారణ సాగుతోంది.  బుధవారం సాయుంత్రం జనార్ధన్‌రెడ్డి సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి(30) ప్రత్యర్థులతో గొడవపడ్డాడు.

    ఈ ఘర్షణలో వే ణుగోపాల్‌రెడ్డి  గాయుపడి ఆస్పత్రి పాలయ్యూడు.  దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను శాంతింపజేశారు. మూందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం రాత్రి గ్రావుంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయుం పోలీసులు గ్రావుం విడిచి వెళ్లిపోయూరు. ఎప్పటిలాగే రెండు వర్గాలవారు పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు రావుకుప్పం పట్టణానికి వచ్చారు.

    విజలాపురం క్రాస్ వద్ద  ఒకరికొకరు ఎదురుపడ్డారు. వూటావూట పెరిగి వ్యక్తిగత దూషణలకు దిగారు. అంతలోనే కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో జనార్ధన్‌రెడ్డి(42), మూనిరెడ్డి(45), కుందనందారెడ్డి(48), కాశిరెడ్డి(30), ఆనందప్ప(45) తీవ్రంగా గాయుపడ్డారు. సవూచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయుపడినవారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.  

    అనంతరం మెరుగైన వైద్యం కోసం బంధువులు కుప్పం తీసుకెళ్లారు. సవుస్యలను పరిష్కరించడంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కాలయూపన చేయుడంతోనే రక్తపాతం సంభవించిందని పలువురు వుండిపడుతున్నారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటావుని స్థానిక పోలీసులు తెలిపారు.  ఇదిలాఉండగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియుక గ్రావుస్తులు బిక్కుబిక్కువుని కాలం గడుపుతున్నారు. గ్రావుంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయూలని పలువురు కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు