నిజమైన కథనాలతో మీడియా విశ్వసనీయత కాపాడాలి

31 Aug, 2013 15:49 IST|Sakshi
నిజమైన కథనాలతో మీడియా విశ్వసనీయత కాపాడాలి

మీడియా నిజమైన కథనాలు మాత్రమే వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి శనివారం హైదరాబాద్లో అభిప్రాయపడ్డారు. దీని ద్వారా మీడియా విశ్వసనీయతను పరిరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. శనివారం 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రిక మొదటి సంచికను సీఎం కిరణ్ ఇక్కడ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

 

రాజకీయాలు, బిజినెస్కు సంబంధించిన ఆసక్తికర కథనాలను సాధారణ వార్తలతో కలిపి వెల్లడించవద్దని భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మీడియాకు హితవు పలికారు. 'మెట్రో ఇండియా' ఇంటెర్నెట్ ఎడిషన్ను ఆయన ప్రారంభించారు. 'మెట్రో ఇండియా' ఆంగ్ల పత్రికను న్యూఢిల్లీ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,  నగరాల నుంచి ప్రచురించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పత్రిక చైర్మన్ సీ.ఎల్.రాజం వెల్లడించారు.


సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కే.అరుణ, సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఓవైసీ, లోక్సత్తా పార్టీ అధినేత ఎన్.జయప్రకాశ్ నారాయణ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు, టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు