లక్షలు కట్టించుకుని వసతులు కల్పించరా!

12 Jul, 2019 08:23 IST|Sakshi
స్వతంత్ర ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థులు

చసాక్షి, రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి) : లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటూ సరైన సౌకర్యాలు కల్పించడం లేదని నర్సింగ్‌ విద్యార్థులు గురువారం అర్ధరాత్రి ఆందోళన చేశారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద ఉన్న స్వతంత్ర మెడికల్‌ కాలేజీలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారు. వారందరూ ఆందోళనకు దిగారు. ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ తమకు మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని, భోజనం, తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదన్నారు. బాత్‌రూమ్‌ల నుంచి నీరు తెచ్చుకుని తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కోసం ఎక్కడి నుంచో ఇక్కడకు చదువుకోవడానికి వచ్చామన్నారు. అయితే ఇక్కడ కాలేజీ యాజమాన్యం తమను చాలా హీనంగా చూస్తోందని ఆరోపించారు. కాగా.. నర్సింగ్‌ కాలేజీ అధినేత గన్ని భాస్కరరావు.. భోజనంపై హాస్టల్‌ నిర్వాహకుడితో మాట్లాడారు. అయినప్పటికి కాలేజీ విద్యార్థులు ఆందోళన విరమించలేదు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కాగా.. విద్యార్థులతో కాలేజీ యాజమాన్యం చర్చలు
కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు