మీ కోసం వచ్చాం..దయ చూపండయ్యా!

14 Nov, 2017 10:26 IST|Sakshi
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఇతర అధికారులు

జిల్లాలోని ప్రజలు సమస్యలను పరిష్కరించుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌లో అధికారులు ఏర్పాటు చేసిన మీ కోసం ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్‌ ప్రద్యుమ్న, జెసీ గిరీషా, డీఆర్‌ఓ రజియాబేగం, జేసీ–2 చంద్రమౌళి వినతులు స్వీకరించారు.

రుణాలు మంజూరు చేయాలి
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ రుణాలు 2014 నుంచి 2017 వరకు సక్రమంగా అమలు చేయలేదని సోమవారం క లెక్టరేట్‌ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం స భ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్రమణ్యం మాట్లాడు తూ రుణాలు మంజూరు చేయక వేలాది మంది ఉపాధి లేక అవస్థలు పడుతున్నారన్నారు. బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు.  దళితులపై దాడులు పెరిగిపోయాయని, వారికి చ ట్టాలు రక్షణ కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

టోల్‌ప్లాజా తేనెపల్లెకు దూరంగా నిర్మించాలి
పూతలపట్టు మండలం తేనేపల్లె పంచాయతీ రంగంపే ట, ఎస్టీకాలనీ, బిదారమిట్ట, తాటితోపు, ఇందిర్మ కా లనీ వాసులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి సౌకర్యం ఉన్న భూములు వద్ద టోల్‌ ప్లాజా నిర్మించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారని, దీంతో తమ భూములు ఇవ్వాల్సి వస్తుందన్నారు.  తాము భూములు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. రంగపేట, తేనేపల్లెకు దూరంగా 20 మై లురాయి నుంచి 21వ మైలురాయి వరకు ప్రభుత్వ భూ మి ఉందని, టోల్‌ప్లాజాను అక్కడ నిర్మించుకోవాలన్నా రు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

శ్మశాన స్థలాలు కేటాయించాలి
రాష్ట్రమంతటా క్రైస్తవులకు శ్మశాన స్థలాలు కేటాయించా లని క్రిస్టియన్‌ లీడర్‌ ఫోరం రాష్ట్ర సభ్యుడు రెవరెండ్‌ ఆర్‌ జోబు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 9వ తేదీ విజయవాడలో రాష్ట్ర నలు మూలల నుంచి క్రైస్తవులతో రాష్ట్ర క్రైస్తవుల మహా సమ్మేళనం నిర్వహించనున్నామని చెప్పారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తామన్నారు. క్రైస్తవులకు ఇప్పటివరకు శ్మశాన స్థలాలు కేటాయించక పోవడం దారుణమన్నారు.

అభ్యున్నతికి నోచని సంచార జాతులు
స్వాసంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా సంచా ర జాతుల వారు అభ్యున్నతికి నోచుకోలేదని రాష్ట్ర సంచారజాతుల సంఘం అధ్యక్షుడు రవి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతులను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించారని, వీరి కోసం ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, జీఓ నంబర్‌ 17ను విడుదల చేసిందన్నారు. ఇంతవరకు ఒక్కరికి కూడా రుణాలు మంజూరు చేయలేదన్నారు. సంచార జాతుల  పిల్లలకు రెసిడెన్సి యల్‌ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు