మీ–సేవ కేంద్రాలు ఏర్పాటయ్యేనా!

9 Apr, 2018 10:04 IST|Sakshi
శోదన్‌నగర్‌లోని మీ–సేవ కేంద్రం

స్వార్థపరుల వల్ల కేంద్రాల ఏర్పాటులో జాప్యం

కోర్టులో స్టే ఉన్నా నోటిఫికేషన్‌ విడుదల

గతంలో ఇచ్చిన కేంద్రాలపై అధికారులకు నోటీసులు

కోర్టుకు వెళ్లే ఆలోచనలో బాధితులు

నెల్లూరు(పొగతోట) : జిల్లాలో మీ–సేవ కేంద్రాల ఏర్పాటులో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొంతమంది స్వార్థపరుల వలన నూతన మీ–సేవ కేంద్రాల ఏర్పాటులో నాలుగు సంవత్సరాల నుంచి జాప్యం జరుగుతోంది. నిరుద్యోగులు మీ–సేవ కేంద్రాలకోసం నాలుగు సంవత్సరాల నుంచి ఎదరుచూస్తున్నారు. కోర్టులో స్టే ఉండటంతో గత మూడు సంవత్సరాల నుంచి నూతన మీ–సేవ కేంద్రాలు మంజూరు చేయలేదు. కోర్టులో స్టే ఉన్నా మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు కార్వే, ఏపీఆన్‌లైన్‌ సంస్థలు 222 సెంటర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. నోటిఫికేషన్లకు సంబంధించి అధికారులకు కం టెంట్‌ కేసులు, సంస్థలకు నోటీసులు జారీ కానున్నట్లు సమాచారం. మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకోసం నిరుద్యోగులు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. కోర్టులోఉన్న కేసులను పరిష్కరించడంలో జిల్లా యం త్రాంగం విఫలమైంది.

ఫలితంగా జనా భాకు తగ్గట్లు మీ–సేవ కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉన్న కొద్ది సెంటర్లు ప్రజలనుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 32 లక్షల మంది జనాభా ఉ న్నారు. జనాభాకు తగ్గట్లు మీ– సేవ కేం ద్రాలు లేవు. జిల్లా వ్యాప్తంగా 204 మీ– సేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మ రో 222 మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. మీ– సేవ కేంద్రాల ద్వారా 364 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారు. విద్యుత్‌ బిల్లు, రైల్వే టికెట్, నేటివిటీ, ఆదాయం, అడంగళ్, వన్‌–బి ఇలా ప్రతిదీ మీ–సేవ ద్వారా పొందాల్సిందే. దీనివల్ల మీ– సేవ కేంద్రాలకు డిమాండ్‌ పెరిగింది. 2014లో 78 మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు అప్పటి అధికారులు చర్యలు చేపట్టారు. ఎంపిక ప్రక్రియ సరిగాలేదని కొందరు  కోర్టును ఆశ్రయించారు. 2014లో కోర్టు స్టే ఇచ్చింది. అదే స్టే ఇప్పటివరకు కొనసాగుతోంది.

దీనివల్ల  గతమూడు సంవత్సరాల నుంచి మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు కాలేదు. కోర్టుకు వెళ్లిన వారి తో కేసు విత్‌డ్రా చేసుకోమని అధికారులు మాట్లాడారు. దానికి వారు మేము కోరిన సెంటర్లు మాకు కేటాయిం చాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. దీనికి అధికారులు అంగీకరించినట్లు సమాచారం. చివరికి చర్చలు వి ఫలం కావడంతో కోర్టులో స్టే కొనసాగుతోంది. 2014లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను అధికారులు విత్‌డ్రా చేసుకుని కొత్త మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. కొత్త మీ–సేవ కేంద్రాలు ఏర్పాటును అడ్డుకునేందుకు కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయిం చినట్లు సమాచారం.  మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లు మీ–సేవ కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేస్తే బిజినెస్‌ తగ్గుతుందనే నెపంతో కోర్టులో కేసులు వేస్తున్నట్లు సమాచారం. పాత వాటిని పేరు మార్పు చేసుకోవడానికి రూ.3 నుంచి రూ.4 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రధాన కూడళ్లలో మీ– సేవ కేంద్రాలను రూ.7 నుంచి రూ.8 లక్షలకు విక్రయిం చేందుకు బేరం పెట్టినట్లు సమాచారం. నిరుద్యోగులు మీ– సేవ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చినా లక్షలరూపాయలు డిమాండ్‌ చేస్తుండటంతో వెనుకడుగు వేస్తున్నారు. గతంలో ఆర్‌డీఓల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించేవారు. ప్రస్తుతం కార్వే, ఏపీఆన్‌లైన్‌ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వాటిపై ఎన్ని ఆరోపణలు చేస్తారో, ఎంతమంది కోర్టును ఆశ్రయిస్తారో వేచి చూడాలి.

ఇబ్బందులు లేకుండా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేశాం. నూతన మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు ప్రక్రియ కార్వే, ఏపీ ఆన్‌లైన్‌ అధ్వర్యంలో నిర్వహిస్తారు. ఎటువంటి సమస్యలు లేకుండా నూతన మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.     –వి. వెంకటసుబ్బారెడ్డి, ఇన్‌చార్జి జేసీ

మరిన్ని వార్తలు