ఏపీలో ఉత్పత్తికి సిద్ధమైన ‘డైకీ’

29 Oct, 2019 19:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: వందేళ్ల చరిత్ర కలిగిన జపాన్ దిగ్గజ ఉక్కు సంస్థ ‘డైకీ’ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తికి సిద్ధమైంది. డైకీ అల్యూమినియం సంస్థకు చెందిన ప్రతినిధులు మంగళవారం ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న తమ ప్లాంట్ వివరాలను మంత్రికి వెల్లడించారు. ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాలు, సంస్కరణలను గురించి డైకీ ప్రతినిధులకు మంత్రి వివరించడంతో.. ఏపీ అభివృద్ది దిశగా ముందుకెళుతోందని వారు హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఉక్కును అందించడంలో ఏమాత్రం రాజీపడకుండా ముందుకు వెళుతున్న డైకీ సంస్థను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. డైకీ ఉక్కు కర్మాగారానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపడతామని వారితో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు