మన్నవరం ప్రాజెక్టుపై మంత్రి మేకపాటి క్లారిటీ

12 Dec, 2019 13:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : స్థానిక అవసరాలకు తగ్గట్లు కంపెనీల ఏర్పాటుకు ప్రాముఖ్యత  ఇస్తుందని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి  పేర్కొన్నారు. మన్నవరం ఎన్టీపీసీ- బీహెచ్ఇఎల్‌ పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌కు శంకుస్థాపన, ప్రాజెక్టుకు సంబంధించి తయారీ యూనిట్లను రద్దు చేసిన విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు తన వెంకటగిరి నియోజకవర్గానికి కేవలం 2 కి. మీ దూరంలోనే ఉందని.. మన్నవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని అడిగారు. ఈ ప్రశ్నపై  మంత్రి సమాధానమిస్తూ.. వెంకటగిరితో తమకు కూడా సంబంధాలున్నాయని తాము కూడా మెట్ట ప్రాంతాల వాసులమేనని అన్నారు. మన్నవరం ప్రాజెక్టులో ఎన్‌టీపీసీ- బీహెచ్‌ఇయల్‌ ధర్మల్‌ ప్రాజెక్ట్స్‌ చేస్తారని, ఎన్‌టీపీసీ విద్యుత్‌ ఉత్పత్తి చేసే సంస్థ అని బీహెచ్‌ఇయల్‌ ధర్మల్‌ ప్రాజెక్టులకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుందని వివరించారు. అయితే ఇప్పుడు అక్కడ ప్రత్యామ్నాయాలు కూడా చూస్తున్నామని మంత్రి తెలిపారు. 

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చర్‌ క్లస్టర్స్‌ తీసుకువస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. ఇప్పటికే వేరే కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని అక్కడ ఈఎంసీ-3 ప్రారంభం కాబోతోందని  తెలిపారు. ఇప్పటికే ఈఎంసీ-1 అయిపోయిందని.. ఈఎంసీ-2 వచ్చిందని.. త్వరలో ఈఎంసీ-3 కూడా విస్తరించనున్నామని వెల్లడించారు. వెంకటగిరికి వచ్చేసరికి సాంప్రదాయ చేనేత, హస్తకళలు వంటి సానుకూలతలు ఉన్నాయని వివరించారు. అపెరెల్స్‌, గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలు కూడా అక్కడ ఏర్పాటు చేయవచ్చన్నారు. ఎన్టీపీసీ ఆ భూమిలో సోలార్‌ ప్లాంట్‌ యూనిట్‌ ఏర్పాటు చేయకపోతే.. ప్రత్యామ్నాయాలు చూస్తామని  తెలిపారు. అధునాతనమైన వ్యాపార అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి తీసుకురావాలని ఎన్నోసార్లు చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన్నవరం ప్రాజెక్టుపైన కేంద్ర సహకారం కూడా తీసుకొంటామని మేకపాటి  గౌతంరెడ్డి సమాధానం ఇచ్చారు.

చదవండి: అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన చెవిరెడ్డి..

చంద్రబాబుకు మానవత్వం లేదు: సీఎం జగన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా